top of page

విడుదల కొరకైన ప్రార్థన

  • May 15
  • 4 min read

Updated: May 15

షాలోమ్!

లూకా సువార్త 4:18లో యేసు ఇలా చెప్పారు, "... చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు”


నేను షెల్సి రాయల్ టింకర్, ప్రవక్తినిగా పరిచర్యలో వాడబడుచున్నాను. ప్రజలకు విమోచన ప్రార్థనలు చేస్తూవుంటాను. ఈ సమయంలో మీరు ఉన్న చోటుననే ఈ ప్రార్థనను అనుసరించడం ద్వారా మీరు విడుదల పొందగలరు. ఈ ఒప్పుకోలు ప్రార్థనకు, దేవుని సేవకులు మీతో వుండవలసిన అవనరం లేదు, ఇది పూర్తిగా స్వీయ విమోచన ప్రార్థన. అయితే కొన్ని బలమైన బంధకాల నుండి పూర్తిగా విడుదల పొందడానికి, దైవజనులచే హస్తనిక్షేపన అభిషేక ప్రార్థన అవసరం కావచ్చు. అయినప్పటికి మీరు ఈ ప్రార్థనను తప్పకుండా చేయాలని నేను ప్రోత్సహిస్తున్నాను. మీరు ఈ ప్రార్థనను చేసినప్పుడు, సాతాను కాడిని విరగ్గొట్టడానికి పరిశుద్ధాత్మ శక్తి మీలో ప్రత్యక్షమగునట్లు మరియు అభిషేకం మీ మీద కుమ్మరించబడునని నేను ప్రకటిస్తున్నాను. మీరు సంపూర్ణ విడుదలను పొందుకుంటారు మరియు సమృద్ధియైన ఆశీర్వాదంలోనికి మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు అని ప్రవచనాత్మకముగా మీపై ప్రకటిస్తున్నాను. యోహాను సువార్త 8:36లో తెలుపబడిన విధముగా "కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు". ఈ విమోచనను ఇప్పుడు మీరు పొందుటకు సమయం ఇదే.


ఈ ప్రార్థనలలో మీరు ఏకీభవించడానికి ముందు, సిద్దపడిన హృదయము అనగా "యదార్థ" హృదయం గలవారై ప్రార్థన చేయవలెనని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మత్తయి సువార్త 5:8లో చెప్పబడిన విధముగా "హృదయ శుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.” మనం స్వభావరీత్యా పరిపూర్ణులం కాదు, కానీ దేవుని ప్రేమ మనకు అనుగ్రహించబడింది, దాని ద్వారా మనం యేసు రక్తంలో శుద్ధి చేయబడి పవిత్రులమవుతాము, కాబట్టి పశ్చాత్తాపపడే హృదయం మిమ్మల్ని దేవుని కృపకు దగ్గరగా చేస్తుంది. ఈ సమయాన్ని విలువైనదిగా భావించి, మీ పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకొని మోకరిల్లి, పరిశుద్ధాత్ముని శక్తి మీలో క్రియ జరిగించున్నట్లుగా ఆయనను ఆహ్వానించండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి, ఈ విమోచన ప్రక్రియను పూర్తిగా నమ్మండి. ఈ ప్రార్థనలోని కొన్ని పదాలు మీకు చాలా కొత్తగా అనిపించవచ్చు, కానీ మీకు ఆధ్యాత్మిక విషయాల గురించి అవగాహన లేకపోవచ్చు కాబట్టి, సానుకూల హృదయంతో ఉండండి. ఈ ప్రపంచంలో ప్రతిదీ భౌతికమైనది కాదు, దురాత్మలు ఉన్నాయని మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12లో వ్రాయబడినట్లుగా "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” మరియు ఈ దురాత్మలు ప్రజలను ఆవహిస్తాయి లేదా పాపము, వ్యసనములు, రోగాలు, కొరతలు, మానసిక వేదనలు మొదలైన వాటితో మనుష్యులను బాధించడానికి ప్రయత్నిస్తాయి. ఇది వివిధ దశలలో జరుగుతుంది. మరియు ఇది కొన్నిసార్లు తెలిసి/తెలియకుండా చేసిన ఒప్పందాల ద్వారా, లేదా ఒక అమాయకుడిపై ఇతరులు చేసే దుష్కార్యాల ద్వారా, లేదా సొంత నిర్లక్ష్యం మరియు ఉద్దేశపూర్వక పాపపు అలవాట్ల వల్ల కూడా ఇది జరగవచ్చు. అపవాదికి ద్వారం తెరిచినప్పటికీ, మన దేవుడు సర్వశక్తిమంతుడు. కొలొస్సయులకు రాసిన పత్రిక 2:15లో ఇలా వ్రాయబడి ఉంది, "ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.” మరియు యెషయా 10:27లో "(అభిషేకము చేత) ...నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును” అని వ్రాయబడియున్న ప్రకారం పరిశుద్ధాత్మ అభిషేకం మనకు చాలు. ప్రస్తుతానికి ఈ విషయాలను అర్థం చేసుకోవడం కంటే విశ్వాసమే మీకు ముఖ్యం. ఈ రోజు మీ స్వేచ్ఛకు అజ్ఞానం అడ్డంకి కాకుండా చూసుకోండి. విజయం యేసుదేనని, ఒప్పుకోలు మరియు విశ్వాసం గల హృదయం మాత్రమే మీకు అవసరమని ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి, ఈ విషయాలను బిగ్గరగా, స్పష్టంగా ప్రార్థించండి.


  1. నా స్వకీయమైన దురాశచేత చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని యేసు నామంలో విడిచిపెడుతున్నాను.

  2. నేను అబద్ధ దేవుళ్లను, విగ్రహాలను, డబ్బును, ప్రజలను, సంపదను, సౌందర్యాన్ని, పూర్వీకులను ఆరాధించడాన్ని ఒప్పుకొని యేసు నామంలో విడిచిపెడుతున్నాను.

  3. నేను శాపనార్థాలు, అబద్ధపు నాలుక, దూషణలు, అబద్ధ సాక్ష్యాలు, సైతాను మంత్రాలను జపించడం, అబద్ధ ప్రమాణాలు చేయడం, నాలుకతో చేసే ప్రతి పాపాన్ని ఒప్పుకొని యేసు నామంలో విడిచిపెడుతున్నాను.

  4. నేను గర్వం, చేదుత్వము, అసూయ, ఈర్ష్య, కపటం, పగ, వక్ర స్వభావం, అవిశ్వాసం, అవిధేయత, దుర్నీతి, అప్రామాణికత, దైవభయం లేకపోవడం ఇవన్నీ ఒప్పుకొని యేసు నామంలో విడిచిపెడుతున్నాను.

  5. నేను మద్యం, డ్రగ్స్, మత్తుపదార్థాలు, సోషల్ మీడియా, సినిమాలు, మంత్రముగ్ధులను చేసే సంగీతం, అక్రమ సంబంధాలకు బానిసత్వాలను ఒప్పుకొని యేసు నామంలో విడిచిపెడుతున్నాను.

  6. నేను ధనాశను, అన్యాయపు పనులను, నకిలీ డబ్బు మూలాలను, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఒప్పుకొని యేసు నామంలో విడిచిపెడుతున్నాను.

  7. నేను దయ్యపు ఆత్మల సంబంధాలను, కామాన్ని, అశ్లీల చిత్రాలకు వ్యసనం మరియు అన్ని లైంగిక అనైతికతలను ఒప్పుకొని యేసు నామంలో విడిచిపెడుతున్నాను.

  8. నేను దేవుని పది ఆజ్ఞలను మరియు, ధర్మశాస్త్రములోని నియమాలను ఉల్లంఘించడాన్ని ఒప్పుకొని యేసు నామంలో విడిచిపెడుతున్నాను.

  9. నేను అజ్ఞానం మరియు నిస్సహాయత వలన చేసిన పాపాలను ఒప్పుకొని యేసు నామంలో విడిచిపెడుతున్నాను.

  10. యేసు నామంలో, పాప సంబంధమైన కార్యకలాపాలు, వస్తువులు, స్థలాలు, వ్యక్తులందరి నుండి నన్ను నేను వేరు చేసుకుంటున్నాను మరియు పాపం ద్వారా నాకు అంటుకట్టబడివున్న ప్రతి దురాత్మను, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా నుండి తొలగిపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను.

  11. యేసు నామంలో, నాపైన మరియు నా జీవితంపైన ఉన్న ప్రతి తరతరాల శాపాన్ని నేను విరిచివేస్తున్నాను మరియు హేయమైన ఏ పూర్వీకుల సంపదలోనూ నేను పాలుపంచుకోను. యేసు నామంలో క్షమాపణ కోసం నేను వేడుకుంటున్నాను.

  12. నా కలలలో జరిగే ప్రతి దురాత్మ యొక్క దాడిని యేసు నామంలో గద్దిస్తున్నాను. నా కలలలో చేసుకున్న ప్రతి ఒప్పందం నుండి యేసు నామంలో నన్ను నేను వేరు చేసుకుంటున్నాను.

  13. యేసు నామంలో అపవాది యొక్క ప్రతి అబద్ధాన్ని నేను గద్దిస్తున్నాను మరియు సాతాను స్వరాన్ని ఇకపై వినను. యేసు నామంలో నా మనస్సు, ఆలోచనలు, చెవులు మరియు హృదయం మీద యేసు రక్తాన్ని వ్రాసుకుంటున్నాను. నేను ఇకపై శత్రువు చేత మోసపోను అని యేసు నామంలో ప్రకటిస్తున్నాను.

యేసును క్షమాపణ కోసం వేడుకోండి మరియు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి యేసు రక్తాన్ని అంగీకరించండి. ఆయన రక్షణ కృపను పొంది, యేసును మీ ప్రభువుగా, దేవుడిగా మరియు రక్షకుడిగా అంగీకరించుడి.


క్రింద ఉన్న ప్రతి అంశాన్ని "ఆమెన్" అని అంగీకరించి, ప్రార్థనలో పాలుపంచుకోండి...

నేను ఈ ప్రార్థనను అంగీకరించుతున్న మీకందరికీ, యేసు నామంలో సంపూర్ణ విమోచన కలుగును గాక అని ప్రకటిస్తున్నాను.

  1. మీ జీవితంపై ఉన్న ప్రతి మంత్రశక్తి యేసు నామంలో నాశనం చేయబడును గాక

  2. ప్రతి శాపం మరియు మంత్రం యేసు నామంలో మీ జీవితం నుండి విరిగిపోవును గాక

  3. ప్రతి బలహీన పరచు దయ్యము యేసు నామంలో ఇప్పుడే మిమ్మల్ని విడిచి వెళ్ళును గాక

  4. మీకు వ్యతిరేకంగా ఏర్పరచబడిన ప్రతి ఆయుధం శక్తిహీనంగా మారును గాక అని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను

  5. హింస, పాత గాయాలు, పాపం మరియు వ్యసనం నుండి వచ్చిన ప్రతి దురాత్మను యేసు నామంలో మీ నుండి గద్దించివేస్తున్నాను

  6. మిమ్మల్ని గమనిస్తున్న ప్రతి దురాత్మను యేసు నామంలో ఇప్పుడే మీ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను

  7. గర్భం నుండి మీకు అంటుకొని ఉన్న ప్రతి దురాత్మ యేసు నామంలో నాశనం చేయబడును గాక

  8. యేసు నామంలో గందరగోళం, సందేహం, భయం, మానసిక క్షోభ ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్ళాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను

  9. మీ జన్మస్థలం మరియు మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతము నుండి వస్తున్న ప్రతి ప్రాంతీయ-దురాత్మను మీపై ఎటువంటి ఆధిపత్యం కలిగి ఉండదని నేను యేసు నామంలో ప్రకటిస్తున్నాను

  10. ప్రతి సంకెళ్ళు, బంధకాలు యేసు నామంలో ఇప్పుడే మీ నుండి విరిగిపోవును గాక

  11. ప్రతి అపవిత్రమైన చీకటి ఆత్మ యేసు నామంలో మీ ఇంటి నుండి వెళ్ళిపోవును గాక

  12. దయ్యాల దాడుల నుండి మీకు సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుందని యేసు నామంలో ప్రకటిస్తున్నాను

  13. శాంతి మరియు ఆనందంతో మీ హృదయం పూర్తిగా నింపబడును గాక అని యేసు నామంలో ప్రకటిస్తున్నాను

  14. యేసు నామంలో మీ హృదయం స్వస్థత పొందాలని నేను ప్రకటిస్తున్నాను

  15. యేసు నామంలో మీ మనస్సు నూతనపరచబడును గాక

  16. యేసు నామంలో మీ ఆత్మ నూతనపరచబడును గాక

ఈ విమోచనను సంపూర్ణంగా అంగీకరించి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి

మీలో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఇప్పుడు ప్రార్థించండి


పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడునని నేను ప్రకటించుచుండగా, ఆమేన్ అని చెప్పండి

యేసు నామంలో, మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక ప్రకటిస్తున్నాను, ఆమేన్.


ఈ క్రింది వాక్యాలను నోటితో బయటకు స్పష్టంగా చెప్పండి -

  1. నేను యేసు నామంలో స్వతంత్రుడను/స్వతంత్రురాలను

  2. నేను యేసు నామంలో పరిశుద్ధత మరియు నీతి అనే వస్త్రమును ధరించితిని

  3. యేసు నామంలో నాకు జీవ కిరీటము ఇవ్వబడింది

  4. నేను అనాథను కాను, నేను దేవుని బిడ్డను, యేసు నామంలో నేను ఆశీర్వదించబడిన వాడను/ ఆశీర్వదించబడిన దానను.

ప్రభువును స్తుతించి ఆరాధించండి!

మీ ఆత్మీయ జీవితంలోనూ, దైనందిన జీవితంలోనూ మీరు మార్పులను చూడటం ప్రారంభిస్తారు. ఈ మార్పులను గమనించి, అపవాది తీసుకొని వచ్చే శోధనలు మరియు అబద్ధాల పట్ల మెలకువగా ఉండండి.

వాటికి లొంగిపోకండి. మీపై మీరు యేసు నామాన్ని ప్రకటించి, అపవాది యొక్క అబద్ధాలను గద్దించండి, మళ్ళీ పాపంలో పడకండి. ప్రతి ఉదయం బైబిలు చదవడం ద్వారా మరియు ప్రార్థనలో సమయం గడపడం ద్వారా ప్రభువులో ఎదుగుతూ ఉండండి. క్రీస్తును కేంద్రంగా చేసుకున్న బలమైన సహవాసంలో చేరండి, మీ కోసం ప్రార్థించేవారు ఉండేలా చూసుకోండి, మీరు చేసే ప్రతి పనిలో దేవునికి లెక్క చెప్పవల్సిన వారిగా ఉండండి.

దేవుడు మిమ్మల్ని దీవించును గాక.


మీ జీవితంలో మీకు ప్రత్యేకంగా స్వస్థత లేదా విమోచన అవసరమైతే, నన్ను సంప్రదించడానికి సంకోచించకండి, నేను మీ కోసం ప్రార్థించడానికి సంతోషిస్తాను.


మీ ప్రార్థన అంశాలను నాకు పంపడానికి క్రింద ఉన్న ఈ బటన్‌ను క్లిక్ చేయండి.





మీరు ఆశీర్వదించబడినట్లైతే క్రింద కామెంట్ వ్రాయండి, అలాగే ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన విమోచన సాక్ష్యాన్ని కూడా పంచుకోవచ్చు.
God bless you

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

Do you have a prayer request? Are you seeking for a miracle in your life? Do you need deliverance or freedom from addiction or do you desire healing or wanting to give your life to Christ? Are you looking for impartation of Annointing? Be it anything, I'm here to pray for you and God is willing to give you your breakthrough today.

Email :

Follow on

  • Instagram
  • Youtube

Send your prayer request

All the prayer requests are carefully handled to ensure privacy and prayed over. You'll receive an acknowledgement mail once you submit this form. Ensure to mention your active Email Id, otherwise our replies may not enter your email inbox.

Subscribe to get exclusive updates

Thanks for subscribing!

bottom of page